Allu Arjun: హైకోర్టులో 3 గంటల పాటు వాదనలు

Allu Arjun

అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో మూడు గంటల పాటు వాదనలు జరిగాయి. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ ముందు బన్నీ తరఫున న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, సతీశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అనుమతి లేకుండానే బన్నీ థియేటర్ కు ర్యాలీగా వచ్చారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై డిఫెన్స్ కౌన్సిల్ విభేదించింది. ముందస్తు అనుమతి కోసం ఏసీపీకి లెటర్ పెట్టారని, ఇందుకు సంబంధించిన అక్నాలెడ్జ్ మెంట్ కూడా తీసుకున్నారని తెలిపారు. థియేటర్ కు సినిమా హీరో, హీరోయిన్లు రావద్దా అని ప్రశ్నించారు. సెక్షన్ 105 బీఎన్ఎస్ (Allu Arjun) అల్లు అర్జున్ కు వర్తించదని వాదించారు. షారూఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా డిఫెన్స్ కౌన్సిల్ ఉదహరించారు. ఇరు పక్షాల వాదనలు విన్నన్యాయస్థానం అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయనను నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. బన్నీని తరలిస్తున్న క్రమంలో కట్టుదట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Image

అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో మూడు గంటల పాటు వాదనలు జరిగాయి. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ ముందు బన్నీ తరఫున న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, సతీశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అనుమతి లేకుండానే బన్నీ థియేటర్ కు ర్యాలీగా వచ్చారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై డిఫెన్స్ కౌన్సిల్ విభేదించింది. ముందస్తు అనుమతి కోసం ఏసీపీకి లెటర్ పెట్టారని, ఇందుకు సంబంధించిన అక్నాలెడ్జ్ మెంట్ కూడా తీసుకున్నారని తెలిపారు. థియేటర్ కు సినిమా హీరో, హీరోయిన్లు రావద్దా అని ప్రశ్నించారు. సెక్షన్ 105 బీఎన్ఎస్ అల్లు అర్జున్ కు వర్తించదని వాదించారు. షారూఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా డిఫెన్స్ కౌన్సిల్ ఉదహరించారు. ఇరు పక్షాల వాదనలు విన్నన్యాయస్థానం అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయనను నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. బన్నీని తరలిస్తున్న క్రమంలో కట్టుదట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Also read: