భారతీయులెందరు
భారతీయులు ఎందరు.. ఇద్దరా.. ముగ్గురా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇరవై ఏండ్ల క్రితం శంకర్ దర్శకత్ం(Director Shankar)లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారతీయుడు. ఇదే సీక్వెల్ తో తెరకెక్కిస్తోన్న చిత్రం ప్రస్తుతం సెట్స్ లో ఉంది. ఇందుకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ విజయవాడలో సాగుతోంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు గంటల ఫుటేజీ వచ్చిందని తెలుస్తోంది. దాన్ని కత్తరించే పనిలో చిత్ర సాంకేతిక బృందం, దర్శకుడు(Director Shankar) బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగు గంటల ఈ ఫుటేజీని రెండు భాగాలుగా భారతీయుడు–2, భారతీయుడు–3 గా ప్రేక్షకుల మందుకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇది అవినీతి, లంచంపై పోరాటానికి సంబంధించిన చిత్రమని ఎన్ని భాగాలైనా తీయడానికి చాన్స్ ఉందనే చర్చనడుస్తోంది. అయితే ఇటీవలే `భారతీయుడు 2` నుంచి ఓ వీడియో రిలీజ్ అయింది. అది టీజరా? ట్రైలరా? అన్నది ఓ కన్ ప్యూజన్.
ఇటీవలి కాలంలో అత్యంత ఆలస్యం అయిన భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి కమల్ హాసన్ మరియు శంకర్ల(Director Shankar) భారతీయుడు 2 తప్ప మరొకటి కాదు, ఇది ఇప్పటికే 3 సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉంది. ఇక ఇప్పుడు ఒరిజినల్ వచ్చి 20+ ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ కొనసాగింపు చాలా ఊహాగానాలకు స్కోప్ ఇవ్వగా, తాజాది నిజంగానే గందరగోళంగా ఉంది.
Read More:

