RRR:ఆర్ఆర్ఆర్ పై రచ్చ కంటిన్యూ!

RRR

ఆర్ఆర్ఆర్ (RRR)చిత్రంపై సినీ ప్రముఖుల వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. వీలైతే సైలెంట్ గా ఉండాలి గానీ.. ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు ఫైర్ అయ్యారు. మన సినిమాకు ఆస్కార్ వస్తుందంటే గర్వపడాలి గానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ప్రపంచమంతా నాటు నాటు సాంగ్ పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మీకున్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో ఇలా మాట్లాడడం చాలా తప్పన్నారు. విజయం సాధిస్తే ప్రశంసించండి, తప్పు చేస్తే మంచిగా చేయాలని వెన్ను తట్టండి, అంతే గానీ ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండంటూ నాగబాబు వీడియో రిలీజ్ చేశారు

ఓ వైపు భారతీయ సినిమాను అందరూ పొగుడుతుంటే.. మరో వైపు ఆ సినిమాపైనే సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పలువురు ఆయనను లక్ష్యంగా చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR)ఆస్కార్ బరిలో నిలబడడానికి చిత్ర యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని,ఆ డబ్బుతో తాను పది సినిమాలు తీస్తానని దర్శక నిర్మాత తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆ సినిమాకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర లెక్కలున్నాయా? అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశ్నించడం మరో సంచలనంగా మారింది. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించడాన్ని నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయంపై రెస్పాండ్ అయింది. ఫ్యాన్స్ మెగా బ్రదర్ అని పిలుచుకునే నాగబాబు సైతం తమ్మారెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRRకి ఆస్కార్ కోసం (RRR )మీద కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం)’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అంతే కాదు.. ఈ కామెంట్‌ను ఎవరికి కావాలంటే వారు అన్వయించుకోవచ్చని నోట్ పెట్టారు. నాగబాబు నుంచి ఏ మాత్రం ఊహించని రిప్లయ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆయనిచ్చిన రిప్లయ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది.

ఆ తర్వాత తాను చేసిన కామెంట్లపైనా తమ్మారెడ్డి స్పందించారు. RRRలోని సాంగ్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని, అదే తనైతే 10 సినిమాలు తీసేవాడినని చెప్పినట్టు తెలిపారు. సినిమాలు రెండు రకాలు అనే ఉద్దేశంతో అలా అన్నానని, ఒకటి రివార్డు సినిమాలు, మరొకటి అవార్డు సినిమాలని పోలిక చేసి చెప్పానన్నారు. ఓ సెమినార్‌లో భాగంగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. అందులో మొత్తం తాను రెండున్నర గంటలు మాట్లాడితే, కేవలం ఒక నిమిషం క్లిపింగ్‌ను మాత్రమే తీసుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేద్దాం అనే కాంటెక్స్ట్ లో తాను చెప్పాను తప్పితే వాళ్లు ఎలా ఖర్చు పెట్టుకుంటే తనకెందుకంటూ తమ్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనిపై వీలైనంత త్వరగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Also read: