Bandla ganesh: బండ్ల గణేశ్ పై క్రిమినల్ కేసు

Bandla ganesh

కాంగ్రెస్‌ లీడర్​,సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla ganesh) పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ కు చెందిన ఇంట్లో గణేశ్ (Bandla ganesh) కిరాయికి ఉంటున్నారు. గత కొద్ది కాలంగా అద్దె కూడా చెల్లించకుండా ఇంట్లోకి ఆమెను రానివ్వడం లేదు. అంతేకాకుండా ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇంటిని ఖాళీ చేయమంటే రౌడీలను తీసుకొచ్చి ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో రూ. 75 కోట్ల విలువైన ఇంటిని ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ నౌహిరా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే తనపైనే పోలీసులు కేసు నమోదుచేశారని ఆమె తెలిపారు. రౌడీలు, రాజకీయ నాయకుల అండతో ఇలా చేస్తున్నాడని నౌహీరా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో డీజీపీకి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో బండ్ల గణేశ్​పై ఐపీసీ 341,506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read: