Daaku Maharaja: డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ రద్దు

Daaku Maharaja

ఏపీలోని అనంతపురం వేదికగా ఇవాళ జరగాల్సిన (Daaku Maharaja) డాకుమహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా (Daaku Maharaja) ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్లు కూడా తెలిపింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది.‘తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందమంతా ఎంతో బాధ పడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నాం. బాధాతప్త హృదయంతో, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

Image

 

ఏపీలోని అనంతపురం వేదికగా ఇవాళ జరగాల్సిన డాకుమహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్లు కూడా తెలిపింది.

Image

అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది.‘తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందమంతా ఎంతో బాధ పడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నాం. బాధాతప్త హృదయంతో, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

Image

Also read: