టాకీస్ : బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటి నటి దివి(Divi). మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తాజాగా లంబసింగి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ.. తన సినిమా కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. అవకాశాల కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. చాలా ఆఫీసుల చుట్టు తిరిగానని వెల్లడించింది.
ఎన్నో ఆడిషన్స్ ఇచ్చానని.. కానీ చాలా మంది రిజెక్ట్ చేసినట్లు పేర్కొంది. కొంతమంది ఫోన్ చేస్తామని చెప్పి.. మళ్లీ టచ్‌లోకి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరికొంతమంది మొహం మీదే తిరస్కరించారని బాధపడింది. సన్నగా ఉన్నానని ఒకరు .. లావుగా ఉన్నావంటూ మరొకరు రిజెక్ట్ చేసేవారని వ్యాఖ్యానించింది.
ఎన్నో ఆడిషన్స్ ఇచ్చానని.. కానీ చాలా మంది రిజెక్ట్ చేసినట్లు పేర్కొంది. కొంతమంది ఫోన్ చేస్తామని చెప్పి.. మళ్లీ టచ్‌లోకి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరికొంతమంది మొహం మీదే తిరస్కరించారని బాధపడింది. సన్నగా ఉన్నానని ఒకరు .. లావుగా ఉన్నావంటూ మరొకరు రిజెక్ట్ చేసేవారని వ్యాఖ్యానించింది. వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ‘చాన్స్ ల కోసం ఓ పాటలో నటిస్తే.. డాన్స్ సరిగా చేయలేదని ట్రోల్ చేశారు. ఇంకా ఘోరం ఏంటంటే.. ఓ సినిమాలో సెలెక్ట్ చేసి రాత్రికి రాత్రే మార్చేశారు. అది రవితేజ సినిమా. అందులోనూ రవితేజ పక్కన లీడ్ రోల్. ఐదు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుండగా రాత్రికి రాత్రే నన్ను మార్చేశారు’. అని దివి (Divi) వ్యాఖ్యానించింది
Also read:
- Amit Shah: తప్పుడు ప్రచారం చేయోద్దని ప్రతిపక్షాలపై ఫైర్
- Eesha Rebba :ఈషా రెబ్బా మెరుపులు
- Bharathiyudu-2 : ఒక్క పాటకు రూ. 30 కోట్లు

