టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం (JACK) జాక్.. కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. స్పై, యాక్షన్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా ఇది రూపొందింది. వేసవి కానుకగా ఏప్రిల్ 10న ఈ (JACK) సినిమా థియేటర్లలో విడుదల కాగా.. మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా పోస్ట్ పెట్టింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు జాక్ సినిమాను నిర్మించారు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మూవీకి అచ్చు రాజమణి, సామ్ సీఎస్ సంగీత దర్శకులుగా పని చేశారు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ చేసిన చేసిన ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు.
టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం జాక్.. కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. స్పై, యాక్షన్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా ఇది రూపొందింది. వేసవి కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా.. మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా పోస్ట్ పెట్టింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు జాక్ సినిమాను నిర్మించారు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మూవీకి అచ్చు రాజమణి, సామ్ సీఎస్ సంగీత దర్శకులుగా పని చేశారు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ చేసిన చేసిన ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు.
Also read:
- Pahalgam: టూరిస్టుల భద్రతపై దాఖలైన పిల్ కొట్టేసిన సుప్రీం
- Cyberabad: రాంగ్ రూట్ లో వెళ్తున్నారా ఫొటో తీసి పంపండి