మహానటి సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి, జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్ ఒక్కసారిగా సౌత్ ఇండియన్ (RowdyJanardhan) సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సావిత్రి పాత్రలో ఆమె ప్రదర్శించిన భావోద్వేగాలు, నటనకు విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమాతో కీర్తి సురేష్‌కు టాలీవుడ్, కోలీవుడ్ రెండింట్లోనూ తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అయితే మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె కెరీర్ కొంత మందగించింది. తమిళ్ సినిమాల్లో మాత్రం విభిన్న కథలతో ప్రయోగాలు చేసినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం పరిమితంగానే వచ్చింది. తెలుగులో చివరిగా నాని నటించిన ‘దసరా’ సినిమాలో కీలక పాత్ర పోషించి మరోసారి హిట్ అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ‘భోళా శంకర్’ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్‌కు టాలీవుడ్‌లో (RowdyJanardhan) అవకాశాలు మరింత తగ్గిపోయాయి.
ఈ పరిస్థితుల్లో ఆమె ఇప్పుడు భారీ ఆశలతో ‘రౌడీ జనార్ధన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మొదటిసారి విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది కీర్తి సురేష్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘మహానటి’ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్రలో కనిపించినప్పటికీ, అప్పట్లో వీరిద్దరికీ కలిసి నటించే సన్నివేశాలు పడలేదు. దాంతో ఇప్పుడు ‘రౌడీ జనార్ధన్’ ద్వారా వీడీ – కీర్తి జంటను తొలిసారిగా వెండితెరపై చూడబోతున్నారు అభిమానులు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో, హీరోయిన్ పాత్ర కూడా అంతే వెయిట్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రను బలంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. కేవలం గ్లామర్‌కే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రగా ఆమె క్యారెక్టర్ ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా కీర్తి సురేష్‌కు తెలుగులో మరో మైలురాయి కావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ‘రౌడీ జనార్ధన్’ విజయం సాధిస్తే, ఆమెకు టాలీవుడ్‌లో మళ్లీ బిగ్ ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న నేపథ్యంలో, వీరిద్దరి కలయిక ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also read:

