Navya Nair: మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. రూ.1.14 లక్షల ఫైన్​

Navya Nair

మలయాళ నటి (Navya Nair) నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్ళిన ఆమెకు మెల్‌బోర్న్ విమానాశ్రయంలో జరిమానా పడింది. కారణం – ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో మల్లెపూలు (Navya Nair) తీసుకెళ్ళడమే.

Image

విమానాశ్రయ సిబ్బంది పూలను గుర్తించడంతో అధికారులు చర్యలు చేపట్టారు. నియమావళి ఉల్లంఘన కింద నవ్యకు ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్‌ విధించారు. ఈ ఘటన ఆన్‌లైన్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నటి నవ్య నాయర్‌ మెల్‌బోర్న్‌లో జరిగిన ఓనం వేడుకల్లో పాల్గొన్నప్పుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ –
“ఆస్ట్రేలియా వెళ్లే ముందు నా నాన్న నాకు మల్లెపూలు తెచ్చారు. వాటిలో కొన్నింటిని తలలో పెట్టుకున్నాను. మరికొన్నింటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇది చట్ట విరుద్ధమని నాకు తెలియదు. పొరపాటున జరిగిపోయింది. ఉద్దేశపూర్వకంగా కాదు. అందుకే అధికారులు నాపై రూ.1.14 లక్షల జరిమానా విధించారు. 28 రోజుల్లో చెల్లించాలని చెప్పారు” అని వివరించారు.

Image

తాను తీసుకెళ్ళిన పూల ఖరీదు పెద్దది కాదని, కానీ జరిమానా మాత్రం లక్ష రూపాయలు కావడం ఆశ్చర్యకరమని నవ్య సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది. పలువురు ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తూ, విదేశాల్లో నియమాలను ఖచ్చితంగా పాటించాలని కామెంట్లు చేస్తున్నారు.

Also read: