Pushpa-2: పుష్ప–2 ఇక పూనకాలే!

బన్నీ.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ పుష్ప–2 (Pushpa-2)ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 టీజర్ విడుదల మేకర్స్. మోస్ట్ యాంటిసిపేటెడ్ టీజర్ గా వచ్చిన ఈ వీడియో నెక్స్ట్ లెవల్లో ఉంది.

అమ్మవారి అవతారంలో అల్లు అర్జున్ అదరగొట్టేశాడు. గంగమ్మ జాతర సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ తో టీజర్ కట్ చేశారు. పూనకాలు తెప్పించే ఈ టీజర్ లో.. విలన్ ను కాలితో తన్ని అదే కాలితో చీర కొంగుని తీసుకొని నడుములో చిక్కుకునే సీన్ ఊర మాస్ రేంజ్ లో వస్తున్న సీన్ ఎక్దమ్ ఉంది. ఇక టీజర్ లో దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించి కేక పుట్టిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

ఇదిలా ఉంటే పుష్ప 2 (Pushpa-2)టీజర్ పై బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.“పుష్ప మాస్ జాతర.. పాత రికార్డ్స్ పాతర.. ఇప్పుడే టీజర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ ” అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కు 2 పెగ్గులు వేసి ప్రశాంతంగా పడుకో అన్న అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. టీజరే 10 పెగ్గులు వేసిన కిక్ ఇచ్చిందని.. ఇంకా అవెందుకు బ్రో అంటూ ఎస్కేఎన్ రిప్లై ఇచ్చాడు.

 

Also read :

Nallamalla: నల్లమలలో మంటలు

Venkata Rao: కాంగ్రెస్ లోకి తెల్లం