ప్రముఖ గాయని రమ్య బెహ్రా (Ramya Behara) పెళ్లి చేసుకున్నారు. ఆమె మరో గాయకుడు, కామారెడ్డికి చెందిన అనురాగ్ కులకర్ణిని పెళ్లి చేసుకున్నారు. నిన్న సాయంత్రం వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంటకు సన్నిహితులు, మిత్రులు శుభాకాంక్షలు చెబుతున్నారు. (Ramya Behara) అనురాగ్ ఐడియా సూపర్ సింగర్ 8కి ఎంపికై విజయం సాధించాడు. రామ్ నటించిన హైపర్ సినిమాలోని బేబిడాల్ పాటతో పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ‘శతమానం భవతి’ సినిమాలోని ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా’ పాట ఆయనకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘కాటమ రాయుడు’, ‘పైసా వసూల్’, ‘లై’, ‘మహానటి’, ‘ఆర్‌ఎక్స్ 100’, ‘గీత గోవిందం’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘సైరా నరసింహారెడ్డి’, శ్యామ్ సింఘా రాయ్ వంటి పెద్ద సినిమాల్లో పాటలు పాడారు. ఇటీవల విడుదలైన ‘అమరన్’లో ‘రంగులే’ అనే పాట పాడింది కూడా ఆయనే. రమ్య బెహరా విషయానికొస్తే.. సూపర్ సింగర్ 4లో పాల్గొంది. ఈమెను కీరవాణి.. టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి తదితర సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి హిట్స్ అయ్యాయి.
ప్రముఖ గాయని రమ్య బెహ్రా పెళ్లి చేసుకున్నారు. ఆమె మరో గాయకుడు, కామారెడ్డికి చెందిన అనురాగ్ కులకర్ణిని పెళ్లి చేసుకున్నారు. నిన్న సాయంత్రం వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంటకు సన్నిహితులు, మిత్రులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనురాగ్ ఐడియా సూపర్ సింగర్ 8కి ఎంపికై విజయం సాధించాడు. రామ్ నటించిన హైపర్ సినిమాలోని బేబిడాల్ పాటతో పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ‘శతమానం భవతి’ సినిమాలోని ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా’ పాట ఆయనకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘కాటమ రాయుడు’, ‘పైసా వసూల్’, ‘లై’, ‘మహానటి’, ‘ఆర్‌ఎక్స్ 100’, ‘గీత గోవిందం’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘సైరా నరసింహారెడ్డి’, శ్యామ్ సింఘా రాయ్ వంటి పెద్ద సినిమాల్లో పాటలు పాడారు. ఇటీవల విడుదలైన ‘అమరన్’లో ‘రంగులే’ అనే పాట పాడింది కూడా ఆయనే. రమ్య బెహరా విషయానికొస్తే.. సూపర్ సింగర్ 4లో పాల్గొంది. ఈమెను కీరవాణి.. టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి తదితర సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి హిట్స్ అయ్యాయి.
Also read: