తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి (Regina) రెజీనా కసాండ్రా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి సినిమాల కారణంగా కాదు, తన వ్యక్తిగత జీవితం – ముఖ్యంగా పెళ్లి విషయం గురించి ఓ సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలే (Regina) కారణం.
2005లో తమిళ చిత్రమైన “కండనాళ్ మొదల్” సినిమాతో తెరంగేట్రం చేసిన రెజీనా, తర్వాత తెలుగు చిత్రం “అసుర”, తమిళ హిట్ సినిమా “కేడీబిల్లా కిల్లాడి రంగా” వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగు, కన్నడ భాషల్లో అవకాశాలు లభించాయి.
కాగా, గత కొన్ని సంవత్సరాలుగా రెజీనా కి పెద్దగా ప్రధాన పాత్రల అవకాశాలు రాకపోవడంతో, ఆమె ప్రత్యేక పాటల్లో నటించడం ప్రారంభించారు. అలాగే ప్రతినాయిక పాత్రలు, వెబ్ సిరీస్ లాంటి కొత్త మాధ్యమాలవైపు అడుగులు వేశారు. ఈ ప్రయోగాలు ఆమెపై బోల్డ్ నటి అనే ముద్ర వేసాయి. అందాల ఆరబోతకు వెనకాడకుండా నటించిన ఆమె, ప్రస్తుతానికి 34 సంవత్సరాలు వయసులో ఉన్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా కి ఓ విలేఖరి “పెళ్లెప్పుడు?” అనే ప్రశ్నను వేయగా ఆమె ముక్కు సూటిగా “నా తల్లే నన్ను పెళ్లెప్పుడు చేసుకుంటావని అడగదు. మీరు ఎందుకు అడుగుతున్నారు? మీకెందుకు?” అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు నెట్‌లో వైరల్ అయ్యాయి.
అయితే, ఈ కామెంట్ కొన్ని నెటిజన్లకు మాత్రం నచ్చలేదు. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్, సెటైర్లు పెరిగిపోతున్నాయి.
-
“పెళ్లి చేసుకుంటావా లేదా?”
-
“ఈ వయసులోనూ నిర్ణయం లేకపోవడమా?”
-
“సెలెబ్రిటీలను ప్రశ్నించడం తప్పా?”
అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తూ, “పెళ్లి వ్యక్తిగత విషయం, ఎవ్వరూ తొందర పెట్టకూడదు” అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నేటి కాలంలో మహిళలు తమ జీవనశైలిపై, వ్యక్తిగత నిర్ణయాలపై స్పష్టతగా ఉండటం తప్పేమీ కాదని పలువురు నెటిజన్లు రెజీనాకు మద్దతు తెలుపుతున్నారు.
Also read: