సినీ నటుడు మంచు (Mohan Babu) మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన ఈ నెల 24 వరకు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పింది. మూడు రోజులుగా జరుగుతున్న మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు (Mohan Babu) దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్‌కు సైబరాబాద్ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే.. తనకు నోటీసులు జారీ చేయటాన్ని సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా.. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. గొడవల నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా.. కనీస భద్రత కల్పించలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని పిటిషన్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం.. అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు తరఫున.. సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మనోజ్‌కు మోహన్ బాబుకు మధ్య జరుగుతున్న గొడవ ఫ్యామిలీ విషయమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 24వరకు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని మోహన్ బాబుకు భారీ ఉపశమనం కలిగించింది. మరోవైపు.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మోహన్ బాబు ఇంటి వద్ద నిఘా పెట్టాలని.. ప్రతి రెండు గంటలకోసారి అక్కడి పరిస్థితి పరిశీలించాలని.. సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.
Also read:

