పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు (FawadXRupali) ఫవాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఫవాద్‌ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది. ‘మీలాంటి వారు భారతీయ సినిమాల్లో వర్క్‌చేయడం మాకు సిగ్గుచేటు’ అని అతడి ఫొటోను షేర్ చేసింది. (FawadXRupali) ఈ పోస్ట్‌కు ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్ ట్యాగ్‌లను యాడ్‌చేసింది. ఇక ‘ఆపరేషన్ సిందూర్’పై పాకిస్తానీ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ చేసిన కామెంట్లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది. వారిని తక్షణమే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటివారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది. మరోవైపు పహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే యూట్యూబ్ (ఇండియా)లో ఈ మూవీ సాంగ్స్ తొలగించారు. అంతకుముందు ఫవాద్ ‘కపూర్ & సన్స్, ఏ దిల్ హై ముష్కిల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు ఫవాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఫవాద్‌ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది. ‘మీలాంటి వారు భారతీయ సినిమాల్లో వర్క్‌చేయడం మాకు సిగ్గుచేటు’ అని అతడి ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్ ట్యాగ్‌లను యాడ్‌చేసింది. ఇక ‘ఆపరేషన్ సిందూర్’పై పాకిస్తానీ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ చేసిన కామెంట్లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది. వారిని తక్షణమే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటివారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది. మరోవైపు పహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే యూట్యూబ్ (ఇండియా)లో ఈ మూవీ సాంగ్స్ తొలగించారు. అంతకుముందు ఫవాద్ ‘కపూర్ & సన్స్, ఏ దిల్ హై ముష్కిల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించారు.
Also read:

