Seethakka: అల్లు అర్జున్‌ పై కక్ష లేదు

Seethakka

హీరో అల్లు అర్జున్​ పైన ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని, అరెస్ట్​ చట్ట ప్రకారం మాత్రమే జరిగిందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. ఈ విషయంలో ఎవ్వరి జోక్యం లేదని సీతక్క (Seethakka) క్లారిటీ ఇచ్చారు. ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హైస్కూల్ ను మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ఎవ్వరిపైన కక్షలు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్​ ప్రభుత్వానికి లేదన్నారు. ‘
అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి తరుపున సీఎం రేవంత్‌ రెడ్డికి బంధుత్వం ఉంది. రేవంత్ రెడ్డి చుట్టం అయి ఉంటారు. తొక్కిస లాటలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. చట్ట ప్రకారం వాళ్లు చేపే పని వాళ్లు చేస్తారు. చట్టం ఎవ్వరి చుట్టం కాదు. అందులో ఎవ్వరు జోక్యం చేసుకోలేదు. ’ అని మంత్రి సీతక్క అన్నారు.

Image

హీరో అల్లు అర్జున్​ పైన ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని, అరెస్ట్​ చట్ట ప్రకారం మాత్రమే జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. ఈ విషయంలో ఎవ్వరి జోక్యం లేదని సీతక్క క్లారిటీ ఇచ్చారు. ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హైస్కూల్ ను మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ఎవ్వరిపైన కక్షలు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్​ ప్రభుత్వానికి లేదన్నారు. ‘

Also read: