KING: ఒక చేయి చాలదు!

KING

‘కింగ్’ సినిమా (KING) షూటింగ్‌లో షారూఖ్ ఖాన్ భుజానికి గాయమైంది. ముంబయిలో వైద్యులు సర్జరీ చేశారు. ఆరోగ్య సమాచారం బయటకు రాగానే అభిమానులు కలత చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో (KING) ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రార్థనలు చేశారు.

Image

ట్రైలర్ లాంచ్‌లో హాజరు

అయితే షారూఖ్ విశ్రాంతి తీసుకోకుండా ఈవెంట్‌కి వచ్చారు. ముంబయిలో జరిగిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ట్రైలర్ లాంచ్‌లో ఆయన కనిపించారు. భుజానికి సపోర్ట్ ఉన్నా, ఆయన చిరునవ్వు మాత్రం అందరినీ కట్టిపడేసింది.

Image

హృదయాన్ని తాకిన సందేశం

అక్కడే అభిమానులకు మెసేజ్ ఇచ్చారు.
“‘కింగ్’ షూటింగ్‌లో గాయమైంది. సర్జరీ జరిగింది. ఇంకో రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటా. అవార్డు అందుకోవడానికి ఒక చెయ్యి చాలు. కానీ నా అభిమానుల ప్రేమను భుజానికెత్తుకోవడానికి మాత్రం ఒక చెయ్యి సరిపోదు” అన్నారు.

అభిమానుల ఆనందం

ఆ మాటలు విన్న హాల్ చప్పట్లతో మార్మోగింది. ఫ్యాన్స్‌ని ఇంత పాజిటివ్‌గా ప్రోత్సహించగలిగే స్టార్ చాలా అరుదు. ఆయన మళ్లీ షూటింగ్ సెట్లో కనిపించే రోజుకై అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also read: