Suriya–Jyothika: ప్రేమ పోరాటం

Suriya–Jyothika

సినిమా ఇండస్ట్రీలో అనేక ప్రేమ జంటలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జంటల్లో SuriyaJyothika జంట ప్రత్యేక స్థానం సంపాదించింది. తెరపై కెమిస్ట్రీతో ఆకట్టుకున్న ఈ (Suriya–Jyothika) జంట, నిజ జీవితంలో కూడా ప్రేమను విజయవంతంగా నిలబెట్టుకున్నది. అయితే వీరి ప్రేమ కథ అంత సులభంగా ముగియలేదని తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు చెబుతున్నాయి.

Image

ఈ జంట పెళ్లి విషయానికి మొదట్లో హీరో సూర్య తండ్రి శివకుమార్  పూర్తిగా ఓకే చెప్పలేదట. సినిమా రంగంలో ప్రేమ వివాహాలు ఎక్కువకాలం నిలబడవని ఆయనకు సందేహం ఉండేదట. అందుకే వెంటనే అంగీకరించకుండా కొంత సమయం తీసుకున్నారని తెలుస్తోంది. కుటుంబం, కెరీర్, భవిష్యత్తు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆలోచించినట్లు సమాచారం.

Image

అయితే ఈ సమయంలో సూర్య తన నిర్ణయంపై ఎంతో దృఢంగా నిలిచాడట. జ్యోతికనే పెళ్లి చేసుకుంటానని, అది సాధ్యం కాకపోతే జీవితాంతం వివాహం చేసుకోనని తండ్రికి స్పష్టంగా చెప్పాడట. కొడుకు మాటల్లో ఉన్న నిజాయితీ, ప్రేమలో ఉన్న గాఢత శివకుమార్‌ను ఆలోచనలో పడేసిందట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

.

కొడుకు ఇలా చెప్పిన తర్వాత తన గతాన్ని ఒకసారి తలచుకున్నానని శివకుమార్ తెలిపారు. తాను వందల సినిమాల్లో నటించానని, అందులో చాలా కథలు ప్రేమ వివాహాలనే సమర్థించేవని గుర్తు చేసుకున్నానన్నారు. సినిమాల్లో ప్రేమను సమర్థించిన నేను, నిజ జీవితంలో నా కొడుకు ప్రేమను ఎందుకు అడ్డుకోవాలి అన్న ప్రశ్న తన మనసులో మెల్లగా మార్పు తీసుకువచ్చిందని ఆయన చెప్పారు.

Image

ఆ ఆలోచనే చివరకు తన నిర్ణయాన్ని పూర్తిగా మార్చిందని, అనంతరం సూర్య–జ్యోతిక ప్రేమకు కుటుంబ సమ్మతి ఇచ్చి వారి పెళ్లికి ఆశీర్వాదం అందించినట్లు శివకుమార్ వెల్లడించారు. కుటుంబ పెద్దగా తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఈ జంట సంతోషకరమైన దాంపత్య జీవితం గడుపుతూ అభిమానులకు ఆదర్శంగా నిలిచింది.

Image

ఇప్పటికీ సూర్య–జ్యోతిక జంటను అభిమానులు ‘పర్ఫెక్ట్ కపుల్’గా కొనియాడుతుంటారు. ప్రేమలో నమ్మకం, కుటుంబం నుంచి వచ్చిన అంగీకారం ఈ రెండూ కలిస్తే సంబంధం ఎంత బలంగా నిలుస్తుందో ఈ జంట కథ మరోసారి నిరూపించింది.

Also read: