చిరంజీవి మెగాస్టార్ (Chiranjeevi) గా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. తన వ్యక్తిగత విషయాలనూ అప్పడప్పుడూ ప్రేక్షకులతో షేర్ చేసుకుంటాడాయన. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు, ఆయన ప్రాముఖ్యతలు ఏంటి, ఆయన ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్ చేస్తాడనే సంగతులు అందరికీ విదితమే. తాజాగా జరిగిన మహానటి సావిత్రికి సంబంధించిన కార్యక్రమంలో చిరంజీవికి (Chiranjeevi) సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి తెలిసింది.
మహానటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ… ‘చిరంజీవి లేవగానే సావిత్రమ్మ ఫొటోను చూస్తారు. నేను మొదటి సారి వారి ఇంటికి వెళ్లిన సమయంలో నాకు ఈ విషయం తెలిసింది. అమ్మ అంటే చిరంజీవికి ఎంత అభిమానమో నాకు అప్పుడే అర్థం అయ్యింది’అన్నారామె. విశ్వంభర సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్న చిరంజీవి.. సావిత్రిపై ఉన్న అభిమానంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా నిద్ర లేచిన వెంటనే దేవుడి ఫోటోను చూస్తారు. కానీ చిరంజీవి తనకు ఎంతో ఇష్టం అయిన సావిత్రి గారి ఫొటోను చూస్తారంటే ఆమె అంటే ఆయనకు ఎంతటి అభిమానమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Also read:
- WaterTap: ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాప్ లపై దృష్టి పెట్టాలె
- CBI: ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
- Radha Kishan Rao: రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీ