Sonakshi Iqbal: బ్రదర్స్ ఎక్కడ?

Sonakshi iqbal

బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హాజ‌హీర్ ఇక్బాల్ (Sonakshi Iqbal) కుటుంబ స‌భ్యుల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. చెల్లి పెళ్లి దగ్గ‌రుండి జ‌రిపించాల్సి సోనాక్షి (Sonakshi Iqbal) అన్న‌య్య‌లు ఇద్ద‌రు మాత్రం వేడుక‌లో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అన్న‌లు ల‌వ్ సిన్హా, ఖుష్ సిన్హా ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల్లో గానీ, పెళ్లి రోజు గానీ, రిసెప్ష‌న్ లో గానీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో వారిద్ద‌రు ఎక్క‌డా? అంటూ అంతా చ‌ర్చించుకుంటున్నారు. ఈ పెళ్లి అన్న‌య్య‌లిద్ద‌రికీ ఇష్టం లేక‌పోవ‌డంతోనే వారు రాలేదని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొ స్తున్నాయి. ఈ విష‌యాన్ని ల‌వ్ సిన్హా దృష్టికి తీసుకెళ్తే ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. రెండు రోజులు స‌మ‌యం ఇవ్వండి. నాకు బ‌ధులివ్వాల‌నిపిస్తే అప్పుడు మీరు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్తాను అని స్కిప్ కొట్టాడు. పెళ్లి కుమార్తె సోద‌రుడిగా అన్న‌య్య చెయ్యాల్సిన ప‌నుల‌ను న‌టుడు , సోనాక్షి స్నేహితుడు స‌ఖీబ్ స‌లీమ్ త‌న భుజాన వేసుకుని మోసాడు. సోనాక్షిని మండ‌పానికి తీసుకొచ్చే స‌మ‌యంలో పూల చ‌ద్ద‌ర్ ని స‌ఖీబ్ ప‌ట్టుకుని న‌డిచాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ కావడంతో సొంత అన్నలు ఎక్కడ..? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Image

ఈ పెళ్లి అన్న‌య్య‌లిద్ద‌రికీ ఇష్టం లేక‌పోవ‌డంతోనే వారు రాలేదని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొ స్తున్నాయి. ఈ విష‌యాన్ని ల‌వ్ సిన్హా దృష్టికి తీసుకెళ్తే ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. రెండు రోజులు స‌మ‌యం ఇవ్వండి. నాకు బ‌ధులివ్వాల‌నిపిస్తే అప్పుడు మీరు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్తాను అని స్కిప్ కొట్టాడు. పెళ్లి కుమార్తె సోద‌రుడిగా అన్న‌య్య చెయ్యాల్సిన ప‌నుల‌ను న‌టుడు , సోనాక్షి స్నేహితుడు స‌ఖీబ్ స‌లీమ్ త‌న భుజాన వేసుకుని మోసాడు. సోనాక్షిని మండ‌పానికి తీసుకొచ్చే స‌మ‌యంలో పూల చ‌ద్ద‌ర్ ని స‌ఖీబ్ ప‌ట్టుకుని న‌డిచాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ కావడంతో సొంత అన్నలు ఎక్కడ..? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Also read: