హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల (STRAY DOGS)దాడులు రోజురోజు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ లో మరోసారి వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 సంవత్సరాల బాలుడిపై కుక్కలు(STRAY DOGS) దాడి చేశాయి. చిన్నారిని విచక్షణారహితంగా కరిచాయి. స్థానికులు చూసి కుక్కలను తరిమి కొట్టి బాలుడిని కాపాడారు. గాయపడిన బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో కూడా ఇవాళ చోటు చేసుకుంది. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో చిన్నారిపై వీధి కుక్క ల దాడి చేశాయి. ఈ దాడిలో జహీదా అనే పాపకు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని హుజూర్నగర్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు.
భాగ్యనగరంలో రోజు రోజుకి వీధి కుక్కల భయం ఎక్కువవుతోంది. దారి వెంట వెళ్తున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తూ.. ఉండడంతో స్థానికంగా ఉన్న జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వీధి కుక్కలు దాడులు సేస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అంబర్‌పేటలో జరిగిన వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మరణించిన ఘటన తర్వాత.. ఇలాంటి దాడులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
also read :

