Temple Alwal: కళా.. భళా.. దశావతారం హిట్

Temple Alwal

వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టెంపుల్ ఆల్వాల్ (Temple Alwal) లోని శ్రీ వేంకటేశ్వరాలయ సమీపంలో ఉన్న సీతారామ చంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. (Temple Alwal) ఇందులో భాగంగా శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, హరికథ కాలక్షేపం, బుర్రకథ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు మంత రాగాలయ మ్యూజిక్, డాన్స్ అకాడమీ వారు నిర్వహించిన దశావతారం నృత్య రూపకం, స్వరనీరాజనం ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాట్యాచార్యులు మంత మాధవి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత నృత్య కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ కరతాళ ధ్వనులతో కళాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి కే అనిల్ కుమార్ వయోలిన్ సహకారం అందించారు. మృదంగ సహకారాన్ని శ్రీ పల్లి నాగేశ్వరరావు ఫ్లూట్ సహకారాన్ని మమత భరద్వాజ, గాత్ర సహకారాన్ని మంత శ్రీనివాస్ శిష్యులు కేఎల్ వీడీ మహేశ్వరి మంత హరిప్రియ అందించారు. రాత్రి 9:30 వరకు సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహూతులను అలరింపజేసింది. ఈ కార్యక్రమంలో దశావతారం నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది.

నాట్యాచార్యులు మంత మాధవి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత నృత్య కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ కరతాళ ధ్వనులతో కళాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి కే అనిల్ కుమార్ వయోలిన్ సహకారం అందించారు. మృదంగ సహకారాన్ని శ్రీ పల్లి నాగేశ్వరరావు ఫ్లూట్ సహకారాన్ని మమత భరద్వాజ, గాత్ర సహకారాన్ని మంత శ్రీనివాస్ శిష్యులు కేఎల్ వీడీ మహేశ్వరి మంత హరిప్రియ అందించారు. రాత్రి 9:30 వరకు సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహూతులను అలరింపజేసింది. ఈ కార్యక్రమంలో దశావతారం నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది.

 

 

Also read: