(Tehran) ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత భీకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మిలటరీ, ఇంటెలిజెన్స్, టెక్నలజీ రంగాలలో శత్రుత్వ దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల తేజ్ మలుపు తిరిగిన ఈ ఘర్షణల వలన ఇరాన్ రాజధాని (Tehran) టెహ్రాన్‌లో మూడు రోజులుగా జరిగిన వరుస కారు బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 14 మంది న్యూక్లియర్ శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఇరాన్ అణుశక్తి అభివృద్ధిలో కీలకంగా పని చేసిన వారు. బాంబు దాడుల్లో 128 మంది పౌరులు మరణించగా, వందలాదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఈ పేలుళ్లు అత్యంత పక్కా పన్నాగంగా, టార్గెట్ చేసినవిగా భావిస్తున్నారు. టెహ్రాన్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో, న్యూక్లియర్ శాఖకు చెందిన అధికారులు ప్రయాణిస్తున్న కార్లపై GPS ఆధారిత బాంబులు అమర్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా ఇజ్రాయెల్‌పై ఆరోపణలు చేసినప్పటికీ, ఇది ఒక ‘అప్రకటిత యుద్ధం’లో భాగమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై ఇదే విధంగా దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా భద్రతా స్థాయిని పెంచింది. న్యూక్లియర్ కేంద్రాల చుట్టూ మిలటరీ పటిష్టంగా మోహరించబడింది. టెహ్రాన్‌లో అన్ని ప్రధాన రహదారులపై తనిఖీలు, గగనతల డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఐక్యరాజ్యసమితి, ఐఏఈఏ వంటి సంస్థలు ఈ దాడులను ఖండించాయి. మానవ హక్కుల సంఘాలు ఈ దాడులను పౌరులపై బలవంతపు మిలటరీ చర్యలుగా అభివర్ణించాయి.ఈ దాడులతో మధ్యప్రాచ్యంలో తిరిగి యుద్ధ భయం గుబాళిస్తున్నది. ఇజ్రాయెల్ సైలెంట్ స్ట్రాటజీని కొనసాగిస్తుందా? లేక ఈ దాడులు మరో ప్రక్షాళనకు తెరలేపుతాయా అనే ఉత్కంఠ పటిష్టంగా ఉంది.
Also read:

