Britain: బ్రిటన్ అల్లర్ల వెనుక 15 ఏండ్ల కుర్రాడు

బ్రిటన్ (Britain) లో గత కొంతకాలంగా చెలరేగుతున్న అల్లర్ల వెనుక ఓ పదిహేనేళ్ల కుర్రాడు ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 2న ఉత్తర ఇంగ్లండ్ లోని హింస, దోపిడీ ఘటనల్లో ఈ కుర్రాడి పాత్ర ఉందని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుర్రాడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఒక వేళ అభియోగాలు రుజువైతే ఈ బాలుడికి పదేండ్ల శిక్ష పడే అవకాశం ఉంది. జులై 30న చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో బ్రిటన్ (Britain)  లో వందలాది మందిని అరెస్టు చేశారు. చట్టపరమైన కారణాల వల్ల పేరు చెప్పలేని యువకుడిని సౌత్ టైన్‌సైడ్ యూత్ కోర్టులో హాజరు పరచనున్నట్లు న్యాయవాదులు తెలిపారు.

బ్రిటన్ లో గత కొంతకాలంగా చెలరేగుతున్న అల్లర్ల వెనుక ఓ పదిహేనేళ్ల కుర్రాడు ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 2న ఉత్తర ఇంగ్లండ్ లోని హింస, దోపిడీ ఘటనల్లో ఈ కుర్రాడి పాత్ర ఉందని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుర్రాడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఒక వేళ అభియోగాలు రుజువైతే ఈ బాలుడికి పదేండ్ల శిక్ష పడే అవకాశం ఉంది. జులై 30న చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో బ్రిటన్ లో వందలాది మందిని అరెస్టు చేశారు. చట్టపరమైన కారణాల వల్ల పేరు చెప్పలేని యువకుడిని సౌత్ టైన్‌సైడ్ యూత్ కోర్టులో హాజరు పరచనున్నట్లు న్యాయవాదులు తెలిపారు.ఈ కుర్రాడు సౌత్ పోర్ట్ అల్లర్లలో మరో 20 ఏండ్ల యువకుడితో పాటు పాల్గొన్నాడని చెప్పారు. సౌత్ పోర్ట్ కు చెందిన టామ్ నెబ్లెట్ ఇవాళ వ్యాన్ పై దాడి చేయడంతోపాటు పోలీసులపై రాళ్లు విసిరాడని తెలిపారు. నల్ల జాతీయులే టార్గెట్ గా ఈ నిరసనలకు ఊతం ఇచ్చినట్టు తెలిపారు. ఆగస్టు 3న మాంచెస్టర్ సిటీ సెంటర్ లో ఓ నల్లజాతీయుడిపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన తెల్లజాతీయుల సమూహంలో స్టాక్ పోర్ట్ కు చెందిన జోసెఫ్ లే ఉన్నారని చెప్పారు. నార్తర్న్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ లో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన కేసులో ఇప్పటి వరకు 1127 మందిని అరెస్టు చేశామని, 648 మందిపై అభియోగాలు మోపామని నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ తెలిపింది.

Image

Also read: