America: ఇరాన్‌పై అమెరికా చేపట్టిన “ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ”

America

అమెరికా (America) చేపట్టిన “ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ” తొలి 100 గంటల్లోనే ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు కొనసాగినట్టు యుద్ధ వీడియోలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌కు ఆదేశాలు ఇచ్చింది  (America) అమెరికా అధ్యక్షుడు Donald Trump అని సమాచారం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ దాడులు భూ, జల, వాయు మార్గాల నుంచి సమన్వయంతో సాగినట్లు అమెరికా విడుదల చేసిన అధికారిక వీడియోల్లో కనిపించింది.

అమెరికా సైన్యం అత్యాధునిక యుద్ధ సాంకేతికతను వినియోగిస్తూ ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలిపింది. ముఖ్యంగా క్షిపణి వ్యవస్థలు, కమాండ్ కేంద్రాలు, నౌకాదళ స్థావరాలు ప్రధాన లక్ష్యాలుగా గుర్తించినట్లు సమాచారం. మొదటగా అమెరికా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి క్షిపణులు ప్రయోగించి ఇరాన్ రాడార్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వీడియోలో చూపించారు. ఆ తర్వాత ఫైటర్ జెట్లు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి పలు ప్రాంతాలపై బాంబు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ ఆపరేషన్‌లో అత్యాధునిక యుద్ధవిమానాలు అయిన B-2 Spirit, F-35 Lightning II, F-22 Raptor మరియు B-52 Stratofortressలను వినియోగించినట్లు అమెరికా వెల్లడించింది. ఈ యుద్ధవిమానాలు గగనతలంలో నుంచి భారీ బాంబు దాడులు చేయగల సామర్థ్యంతో ప్రసిద్ధి చెందాయి. జీపీఎస్ ఆధారిత జేడామ్ బాంబులు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ ఆధారిత దాడి వ్యవస్థలు కూడా ఈ ఆపరేషన్‌లో భాగమయ్యాయి.అమెరికా విడుదల చేసిన యుద్ధ వీడియోల్లో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్న దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా మీనాబ్ ప్రాంతంలోని ఒక బాలికల పాఠశాలపై క్షిపణి దాడి జరిగినట్లు కూడా నివేదికలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా పౌరులు మృతిచెందినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei హతమైనట్లు కూడా కొన్ని సమాచారం వెలువడటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా పూర్తిగా వెలువడలేదు.ఈ యుద్ధ చర్యల్లో అమెరికాకు మిత్రదేశమైన Israel కూడా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సుమారు 200 ఫైటర్ విమానాలను వినియోగించి ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడైంది. అమెరికా విడుదల చేసిన వీడియోలో “ఇది చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన వైమానిక దాడుల్లో ఒకటి” అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఇరాన్ ప్రతీకార దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో తొమ్మిది మంది, United Arab Emiratesలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. యుద్ధ లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియోలో పేర్కొన్నారు.

Also read: