Chandrika Tandon: భారత సంతతి గాయనికి గ్రామీ అవార్డు

Chandrika Tandon

(Chandrika Tandon) భారత సంతతికి చెందిన గాయనీమణికి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు లభించింది. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్ లో జరిగిన వేడుకలో పేరుపొందిన సింగర్స్‌, మ్యూజిక్ డైరెక్టర్స్‌ సందడి చేశారు. భారత సంతతికి చెందిన అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌  (Chandrika Tandon) అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది.

Image తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. చంద్రికకు రెండో గ్రామీ నామినేషన్‌ కావడం విశేషం. చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం విదేశాల్లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీకి చంద్రిక సోదరి అవుతారు. ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం ఎంతోమంది జీవితాల్లో విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. కార్చిచ్చు కారణంగా జీవితాన్ని కోల్పోయిన బాధితులకు అవార్డుల కార్యక్రమంలో సంతాపం ప్రకటించారు.

భారత సంతతికి చెందిన గాయనీమణికి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు లభించింది. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్ లో జరిగిన వేడుకలో పేరుపొందిన సింగర్స్‌, మ్యూజిక్ డైరెక్టర్స్‌ సందడి చేశారు. భారత సంతతికి చెందిన అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది.

Imageతనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. చంద్రికకు రెండో గ్రామీ నామినేషన్‌ కావడం విశేషం. చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం విదేశాల్లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీకి చంద్రిక సోదరి అవుతారు. ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం ఎంతోమంది జీవితాల్లో విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. కార్చిచ్చు కారణంగా జీవితాన్ని కోల్పోయిన బాధితులకు అవార్డుల కార్యక్రమంలో సంతాపం ప్రకటించారు.

Image

Also read: