అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారీఫ్ ప్రకటనలను డ్రాగన్ దేశం చైనా సీరియస్గానే తీసుకుంది. అమెరికా యుద్ధానికి సిద్ధమంటూ సంకేతాలు పంపింది. అమెరికాలోని చైనా ఎంబసీ సంచలన పోస్టును షేర్ చేసింది. ‘అమెరికా నిజంగా అక్రమ వలసల సమస్యను పరిష్కరించాలనుకుంటే నేరుగా చైనాతో సంప్రదించాలని, కోరుకుంటున్నది యుద్ధమే అయితే అది టారిఫ్ వార్ కావచ్చు.. ట్రేడ్ వార్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు..మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొంది. చైనా దిగుమతులపై టారిఫ్ పెంచేందుకు అమెరికా అక్రమ వలసల సమస్యను ట్రంప్ ఓ సాకుగాచూపుతున్నారని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. ఫెంటానిల్ సంక్షోభం పరిష్కారానికి మానవత్వం, అమెరికా ప్రజల పట్ల సద్భావనతో యూఎస్ కు సహాయం చేసేందుకు తాము చర్యలు చేపట్టామని తెలిపింది. దానిని గుర్తించకుండా చైనాపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తోందన్నారు.
సుంకాలు పెంచుతూ చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు, బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తోందని అన్నారు. ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టాక చైనాపై సుంకాల యుద్దం మొదలు పెట్టారు. చైనా వస్తువులపై ఇప్పటికే ఉన్న 10 శాతం కన్నా అదనంగా మరో 10 శాతం సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. కెనడా ,మెక్సికోలతో పాటు కొత్త టారిఫ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే చైనా కూడా అమెరికాకు దీటుగా దిగుమతి సుంకాలు పెంచేసింది. అమెరికా నుంచి చైనాకు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచింది. సోయాబీన్స్ , మొక్కజొన్న నుంచి పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం వరకు వ్యవసాయ ఉత్పత్తులపై 10 శాతం ,15 శాతం మధ్య అదనపు సుంకాలను విధించనున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ ప్రకటనలను డ్రాగన్ దేశం చైనా సీరియస్గానే తీసుకుంది. అమెరికా యుద్ధానికి సిద్ధమంటూ సంకేతాలు పంపింది. అమెరికాలోని చైనా ఎంబసీ సంచలన పోస్టును షేర్ చేసింది. ‘అమెరికా నిజంగా అక్రమ వలసల సమస్యను పరిష్కరించాలనుకుంటే నేరుగా చైనాతో సంప్రదించాలని, కోరుకుంటున్నది యుద్ధమే అయితే అది టారిఫ్ వార్ కావచ్చు.. ట్రేడ్ వార్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు..మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొంది. చైనా దిగుమతులపై టారిఫ్ పెంచేందుకు అమెరికా అక్రమ వలసల సమస్యను ట్రంప్ ఓ సాకుగాచూపుతున్నారని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. ఫెంటానిల్ సంక్షోభం పరిష్కారానికి మానవత్వం, అమెరికా ప్రజల పట్ల సద్భావనతో యూఎస్ కు సహాయం చేసేందుకు తాము చర్యలు చేపట్టామని తెలిపింది.
దానిని గుర్తించకుండా చైనాపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తోందన్నారు. సుంకాలు పెంచుతూ చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు, బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తోందని అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టాక చైనాపై సుంకాల యుద్దం మొదలు పెట్టారు. చైనా వస్తువులపై ఇప్పటికే ఉన్న 10 శాతం కన్నా అదనంగా మరో 10 శాతం సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. కెనడా ,మెక్సికోలతో పాటు కొత్త టారిఫ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే చైనా కూడా అమెరికాకు దీటుగా దిగుమతి సుంకాలు పెంచేసింది. అమెరికా నుంచి చైనాకు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచింది. సోయాబీన్స్ , మొక్కజొన్న నుంచి పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం వరకు వ్యవసాయ ఉత్పత్తులపై 10 శాతం ,15 శాతం మధ్య అదనపు సుంకాలను విధించనున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Also read:
- IT: మెయిల్ లోకి దూరిపోతారు.. సోషల్ మీడియా చెక్ చేస్తారు
- IndVSAus: భారత క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది

