ప్రముఖ ఈకామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ (Flipcart)లో సెల్లర్స్ ను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ దాడులు చేసింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈకామర్స్ ప్లాట్ ఫారమ్ కొందరు వ్యాపారుల అక్రమ లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. ఈ లావాదేవీలు విదేశీ మారకపు చట్టాలకు అనుగుణంగా జరిగాయా లేదా అనే విషయాలను వెలికితీయనుంది. కాగా భారత్ లో వ్యాపారంపై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ (Flipcart)అనేక నిబంధనలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటీవలే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) జరిపిన విచారణలో రెండు కంపెనీలు స్థానిక చట్టాలను ఉల్లంఘించాయని, సెలక్టీవ్ పర్సన్స్ కే తమ కంపెనీల్లో ప్రాధాన్యతనిచ్చాయని ఆరోపించినట్లు సెప్టెంబర్లో రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
Also read :
Revanth Reddy: రేపు సీఎం పాదయాత్ర

