లాస్ ఏంజిల్స్ లో (LosAngeles) కార్చిచ్చు కారణంగా ఆస్కార్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. వాస్తవానికి జనవరి 12న నిర్వహించాలని సంస్థ భావించింది. లాస్ ఏంజెలెస్‌లో (LosAngeles) మంటలు చెలరేగడంతో అవి జనవరి 26కు వాయిదా వేశారు. ఆ కార్చిచ్చు ఇప్పటికీ అదుపులోకి రాకపోవడంతో ఫిబ్రవరి 7కు దాన్ని మరోసారి రీ షెడ్యూల్ చేశారు. శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక ఈ ఏడాది జరగనున్న క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో సమంత-వరుణ్ ధావన్ నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్ : హనీ బన్నీ’ పోటీ పడనుంది. ఉత్తమ విదేశీ భాష సిరీస్‌ల నామినేషన్‌లో ఇది చోటు దక్కించుకుంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సిరీస్ అవార్డును సొంతం చేసుకుంటుందో, లేదో తెలియాలంటే ఫిబ్రవరి 7వరకు ఆగాల్సిందే.
23న ఆస్కార్ నమినేషన్లపై ప్రకటన
కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడింది. జనవరి 17న ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లను మొదట జనవరి 19కు వాయిదా వేశారు. తాజాగా 23న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది ఆస్కార్ రద్దు అయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై అకాడమీ సభ్యులు స్పందించారు. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేని, వేడుకల్లో మార్పు ఉండదని స్పష్టంచేశారు.
లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు కారణంగా ఆస్కార్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. వాస్తవానికి జనవరి 12న నిర్వహించాలని సంస్థ భావించింది. లాస్ ఏంజెలెస్‌లో మంటలు చెలరేగడంతో అవి జనవరి 26కు వాయిదా వేశారు. ఆ కార్చిచ్చు ఇప్పటికీ అదుపులోకి రాకపోవడంతో ఫిబ్రవరి 7కు దాన్ని మరోసారి రీ షెడ్యూల్ చేశారు. శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక ఈ ఏడాది జరగనున్న క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో సమంత-వరుణ్ ధావన్ నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్ : హనీ బన్నీ’ పోటీ పడనుంది. ఉత్తమ విదేశీ భాష సిరీస్‌ల నామినేషన్‌లో ఇది చోటు దక్కించుకుంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సిరీస్ అవార్డును సొంతం చేసుకుంటుందో, లేదో తెలియాలంటే ఫిబ్రవరి 7వరకు ఆగాల్సిందే.

Also read: