సరిహద్దులోని 26 ప్రాంతాల్లో (Pakistan) పాక్ జెట్లు దాడులకు పాల్పడినట్టు కల్నల్ సోఫియా తెలిపారు. వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్టు వివరించారు.ఇవాళ మీడియాతో ఆమె మాట్లాడుతూ… (Pakistan) పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో జనావాసాలపై దాడులు చేస్తోందని తెలిపారు. పాకిస్తాన్ రెచ్చగొడుతోందని, భారత్ పూర్తిగా సంయమనంతో వ్యవహరిస్తోందని క్లారిటీ ఇచ్చారు. అవంతిపూర్, ఉధంపూర్, శ్రీనగర్ లతో దాడులు చేసిందన్నారు. పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తోందని చెప్పారు. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ మానవరహిత యుద్ధ విమానాలను ప్రయోగిస్తోందని తెలిపారు.
ఉధంపూర్, పఠాన్‌కోట్, అధంపూర్,భుజ్‌లోని భారత వైమానిక దళ స్టేషన్లలోని పరికరాలు, సిబ్బందికి పరిమిత నష్టం వాటిల్లిందని చెప్పారు. బారాముల్లా, రాజౌరీ, పూంచ్ పై పాక్ కంటిన్యూగా దాడి చేస్తోందని వివరించారు. పంజాబ్ లోని ఎయిర్ బేస్ ధ్వంసానికి యత్నించి విఫలమైందని అన్నారు. కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో పాకిస్తాన్ కు బుదులిచ్చామని తెలిపారు. ఆధంపూర్ ఎయిర్ బేస్ ధ్వంసం చేశారనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. ఎల్ వోసి వద్ద కాల్పులు జరుపుతుండటంతోపాటు భారీ మిస్సయిల్స్ తో దాడి చేస్తోందని తెలిపారు. భుజ్, బటిండాలోని ఎయిర్‌స్టేషన్లలపై పాక్ దాడి చేసిందని వివరించారు. ఎస్ 400 క్షిపణిని ధ్వంసం చేశామనే తప్పుడు ప్రచారానిక తెరపైకి తెచ్చిందని తెలిపారు.
ఎస్ 400 ను ధ్వంసం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పాక్ సైన్యం దాడులతో ఉద్రిక్తతలను మరింత పెంచుతోందని, వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని తెలిపారు. భారత్ కేవలం పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసి దాడులు చేసిందన్నారు. సిరాసా, సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌కు ఎలాంటి నష్టం జరగలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి తెలిపారు. పశ్చిమ భారత సరిహద్దుల్లో పాక్ దాడి చేస్తోందన్నారు.
ఆలయాలు, ప్రార్థనా మందిరాలే టార్గెట్
పాకిస్తాన్ సైన్యం ప్రధానంఆ ఆలయాలు, ప్రార్థనా స్థలాలను టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడిందని కేంద్రం తెలిపింది. నియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఆ పోస్టులను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. జమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభించాయి.
Also read:

