ప్రియాంక – చోప్రా (Priyanka Chopra) నిక్ జొనాస్ పెళ్లి, వారి మధ్య వయస్సు వ్యత్యాసంపై ప్రియాంక తల్లి మధుచోప్రా (Priyanka Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ సంతోషంగా ఉంటున్నప్పుడు వయసు పెద్ద విషయమేమీ కాదని అభిప్రాయపడ్డారు. నిక్ జొనాస్ చాలా మంచివాడని.. ప్రియాంక అతడితో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
పెళ్లికి ముందు ఒకరోజు నిక్ తనను హోటల్‌కు తీసుకెళ్లి ప్రియాంకకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగాడని.. అప్పుడు తాను అనుకున్న అర్హతలన్నీనిక్ కు చెప్పినట్లు తెలిపారు. వెంటనే నిక్ నేను ఆ వ్యక్తిని కాగలనా.. నాకు ఆ అర్హతలు ఉన్నాయా అని తనని అడిగినట్లు చెప్పారు. ప్రియాంకను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని మాటిస్తున్నానని జోనస్ తనకు చెప్పినట్లు వెల్లడించారు. తాను అప్పుడు ఆశ్చర్యపోయినప్పటికీ.. వెంటనే ఓకే చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక 2018లో ప్రియాంకా- నిక్ జొనాస్‌లు పెళ్లి చేసుకున్నారు. క్రితం ఏడాది సరోగసి ద్వారా ఓ పాపకు జన్మనిచ్చారు. ఆమెకు మాల్తీ మారీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు.
Also read:

