దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ అల్లకల్లోలం నెలకొంది. ఒక్క రోజే రూ. 10 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ట్రంప్ (Trump) నిర్ణయాలు కారణంగా మన మార్కెట్ కుదేలైపోయింది. వాణిజ్య యుద్ధ భయంతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొంది. దీంతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,200 దిగువకు చేరింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో వాటి విలువ గణనీయంగా పడిపోయింది. దీని ప్రభావం మార్కెట్ పై తీవ్రంగా ఉంది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ షేర్లూ భారీ నష్టాల్లో ముగిశాయి. (Trump) ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 33 పైసలు కోల్పోయి 87.51 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి.
టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటినుంచి స్టాక్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తాజాగా చైనాపై అదనంగా మరో 10 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. చైనాపై సుంకాలూ అదేరోజు నుంచి అమలవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రకటనలు మదుపర్లలో ఆందోళనకు కారణమవుతున్నాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే.. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు.. 59 రోజుల్లో.. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు చెందిన 83 శాతం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. దీని విలువ 15 లక్షల 56 వేల 572 రూపాయలు. అంటే రోజుకు 50 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.
Also read:

