ఏపీ లిక్కర్ స్కాం(liquor scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కాచారంలోని సులోచన ఫాంహౌస్ లో దాచిన 12 అట్ట డబ్బాల్లో 11 కోట్ల నగదును సిట్ స్వాధీనం చేసుకుంది. ఏ1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు నిందితులు ఏ40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నగదును 2024 జూన్‌లో నగదు ఫామ్‌హౌస్‌కు తరలించారు. విజయేందర్ రెడ్డి పేరు మీద ఫామ్‌హౌస్ ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇదే తరుణంలో ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్ లోని పది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌లోనూ తనిఖీలు చేశారు. అటు ఏ1 కేసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్టు అయిన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్‌ను కూడా అనువణువు పరిశీలించారు. నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తూనే.. ఎవరెవరూ ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు? ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా భారతి సిమెంట్స్‌లో అణువణువు గాలించారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో పలు డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుని స్టడీ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం భారతి సిమెంట్స్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.(liquor scam)
ఫామ్‌హౌస్ యజమాని విజయేందర్‌రెడ్డి?
వర్ధమాన్ కళాశాల వద్ద ఉన్న సులోచన ఫాం గెస్ట్ హౌస్ యజమానిని విజయేందర్‌రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి సులోచన పేరుతో ఫామ్‌హౌస్ ఉంది. అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతిగదులు ఉన్నాయి. స్టోర్ రూమ్‌లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో నగదు దాచి ఉంచారు. పక్కా సమాచారంతో వెళ్లిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదు జప్తు చేశారు. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ దృష్టి సారించే అవకాశముంది. ఏపీ సిట్ తొలి చార్జిషీట్‌లోనే యూపీ డిస్టిలరీ పేరు ప్రస్తావించింది. 16 డిస్టిలరీల ముడుపులే రూ.1,677.68 కోట్లుగా సిట్ గుర్తించింది. రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థనే యూపీ డిస్టిలరీస్.
Also Read :

