TCS: టీసీఎస్​లో 12 వేల ఉద్యోగాల కోత

టీసీఎస్‌లో 12 వేల ఉద్యోగాల కోత – ఏఐ ప్రభావం కాదంటున్న సీఈవో

దేశంలో అగ్రగామి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)
తమ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 2% వరకు ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
ఇది సంఖ్యాపరంగా చూస్తే దాదాపు 12 వేల మందికి పైగా ఉద్యోగాల కోతకు దారితీస్తుంది.

  • అయితే ఈ ఉద్యోగ కోతకు ఏఐ కారణం కాదు అని సంస్థ సీఈవో కే. కృతివాసన్ స్పష్టంగా తెలిపారు.
  • సంస్థలో బేసిక్ డిజిటల్ స్కిల్స్‌‌పై 5.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ,
  • అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌‌లో లక్ష మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చినట్టు వివరించారు.

కానీ కొన్ని స్థాయిల్లో సీనియర్ ప్రొఫెషనల్స్‌ ఇనీషియల్ ట్రైనింగ్ దాటకపోవడం,
అదే సమయంలో సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లోపించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.TCS

ఇదే తరహాలో

  • మైక్రోసాఫ్ట్ – 15,000 ఉద్యోగాల కోత
  • ఇంటెల్ – 24,000 మంది తొలగింపు ప్లాన్
  • మెటా – 5% వర్క్‌ఫోర్స్ కోత
  • పానసోనిక్ – 10,000 ఉద్యోగాల తగ్గింపు

ఈ ప్రకటనలన్నీ గ్లోబల్ టెక్ రంగంలో జరుగుతున్న మార్పులను సూచిస్తున్నాయి.
ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాల కోసం సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

Also Read :