Miss World: హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో 20 మంది కంటెస్టెంట్స్

72వ మిస్ వరల్డ్(Miss World) పోటీల్లో తాజాగా మరో కీలక దశను చేరుకుంది. నిన్న తొలిరౌండ్ విజయవంతమైంది. తర్వాత, హెడ్-టు-హెడ్ చాలెంజ్‌కు ఎంపికైన టాప్ 20 ఫైనలిస్టుల జాబితాను తాజాగా ప్రకటించారు. 107 మంది పోటీ దారులు ఈ పోటీలో పాల్గొన్నారు. వారు తమ వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ, మానసిక ఆరోగ్యం, మహిళల సాధికారత, విద్య, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలక విషయాలపై ఆత్మవిశ్వాసంగా ప్రసంగించారు(Miss World). ఈ మాటల పోరులో ప్రతిభ, ఆలోచనల స్పష్టత, సమాజం పట్ల ఉన్న బాధ్యతను దృష్టిలో పెట్టుకుని బెస్ట్ 20 మంది ఎంపికయ్యారు. ఇందులో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు అవకాశం దక్కలేదు. ఇవాళ జరిగే తుది రౌండ్‌లో, ఎంపికైన 20 మంది ఫైనలిస్టులకు మరోసారి తమ సామాజిక దృక్పథాన్ని ప్రదర్శించే అవకాశం లభించనుంది. విజేతను ఎంపిక చేయడంలో అభిప్రాయాల స్పష్టత, సామాజిక బాధ్యతపై ఉన్న నిబద్ధత, వ్యక్తిగత అంకితభావం కీలక ప్రమాణాలుగా ఉపయోగించనున్నారు.

Also Read: