Bonalu: బోనాల కోసం 20 కోట్లు

రాష్ట్రంలో ఆషాఢ బోనాల(Bonalu) ఉత్సవాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.20 కోట్లు మంజూరు చేశారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ నెల 26 నుంచి బోనాల జాతర ప్రారంభమతాయన్నారు. ఇవాళ ఆషాడమాస బోనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్​ తో కలిసి సెక్రటేరియట్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడించేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. ‘మొత్తం 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల(Bonalu) జాతర ఘనంగా జరపాలి. బడ్జెట్ లోటు కూడా లేదు. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది.. ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేదానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలి. ’ అని కొండా సురేఖ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ‘ దేవాదాయ శాఖతోపాటు, ప్రైవేట్ గా రన్ అవుతున్న మొత్తం 3026 ఆలయాల కోసం ఫండ్స్ రిలీజ్ చేశాం. అవసరమైతే 10 శాతం ఫండ్స్​ రిలీజ్​ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి జాతర ప్రశాంతంగా జరిగేలా చూడాలి. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్​కాకుండా జాగ్రత్తలు వహించాలి. ఎలాంటి తొక్కిలాట జరుగకుండా భద్రత కల్పించాలి. ’ అని పొన్నం అన్నారు. ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జిల్లాల కలెక్టర్లు,తదితరులు పాల్గొన్నారు.

Also Read :