Hydra: 262 అక్రమ నిర్మాణాలు కూల్చి 111.72 ఎకరాలు స్వాధీనం

రెండు నెలల నుంచి 262 అక్రమ నిర్మాణాలను కూల్చినట్టు  (Hydra) హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 23 ప్రాంతాల్లో తమ యాక్షన్ కొనసాగిందని వివరించింది. ఈ సందర్భంగా చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను కూల్చి ప్రభుత్వానికి సంబంధించిన 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రామ్‌నగర్‌ మణెమ్మ గల్లీలో 3, గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్‌ సున్నం చెరువులో 42, దుండిగల్‌ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. (Hydra) హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు.

రెండు నెలల నుంచి 262 అక్రమ నిర్మాణాలను కూల్చినట్టు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 23 ప్రాంతాల్లో తమ యాక్షన్ కొనసాగిందని వివరించింది. ఈ సందర్భంగా చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను కూల్చి ప్రభుత్వానికి సంబంధించిన 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రామ్‌నగర్‌ మణెమ్మ గల్లీలో 3, గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్‌ సున్నం చెరువులో 42, దుండిగల్‌ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు.

Also read: