లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ. 320 కోట్ల నగదును సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ (Vikas Raj )తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనిఖీల్లో భాగంగా 8 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఎన్నికల బందోబస్తు కోసం 160 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయని అన్నారు. 60 వేల మంది పోలీసులు ఎలక్షన్ డ్యూటీలో ఉంటారని చెప్పారు. పౌరులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రచార సమయం ముగిసినందున నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదని చెప్పారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించినట్టు ఆయన వివరించారు.
Also read :
Priyanka Gandhi : దేశంలో ఏఏ ట్యాక్స్

