పంటలకు ఫ్రీగా బీమా
కూలీలకు 12 వేలు
హైదరాబాద్: బడ్జెట్ లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి (Bhatti Vikramarka) భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు . 33 రకాల సన్న వడ్లు పండించే రైతులకు.. క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని వెల్లడించారు. దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చటం జరుగుతుందన్నారు. సన్న రకం వడ్లు పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సఫల్ యోజన పథకంలో చేరనున్నట్లు వెల్లడించారు. ఈ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారాయన.
రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు
భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో ( Bhatti Vikramarka) భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో భూమి లేని రైతు కూలీలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లందరికీ భరోసా వచ్చిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వాళ్ల జీవితాల్లో వెలుగు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
సన్న వడ్లకు 500 బోనస్
ఈ ఏడాది నుంచే అమలు
పంటలకు ఫ్రీగా బీమా
కూలీలకు 12 వేలు
హైదరాబాద్: బడ్జెట్ లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు . 33 రకాల సన్న వడ్లు పండించే రైతులకు.. క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని వెల్లడించారు. దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చటం జరుగుతుందన్నారు. సన్న రకం వడ్లు పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సఫల్ యోజన పథకంలో చేరనున్నట్లు వెల్లడించారు. ఈ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారాయన.
రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు
భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో భూమి లేని రైతు కూలీలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లందరికీ భరోసా వచ్చిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వాళ్ల జీవితాల్లో వెలుగు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
Also read:
KCR: గ్యాస్.. ట్రాష్ బడ్జెట్ పై ప్రతిపక్ష నేత కేసీఆర్
KCR: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నరు

