Sajjanar : హైదారాబాద్ సిటీ శివారులోని కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ కోసం బస్సులు అదనంగా 100 ట్రిప్పులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం బస్ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులతో ఆయన రివ్యూ చేపట్టారు. హైదరాబాద్లో ఏప్రిల్ చివరి నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అలాగే, గర్ల్స్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక బస్సులను హైదరాబాద్ శివారు విద్యాసంస్థల వరకు ఏర్పాటు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే గర్ల్స్ కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

