Caste census: 6 నుంచి కులగణన

కులగణను(Caste census) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీనిపై ఇవాళ గాంధీభవన్ లో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. వచ్చే నెల 6 నుంచి చేపట్టబోయే కులగణన(Caste census) దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా కులగణనలో భాగస్వామి కావాలని అన్నారు. ఇందుకోసం నవంబర్ 2న 33 జిల్లాల డీసీసీ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కులగణన అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తామని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన పై ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్త చేసేందుకు గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని వివరించారు.

Also Read :