Maharastra: ఏడుగురు సజీవ దహనం

Maharastra

శంభాజీనగర్: మహారాష్ట్రలోని (Maharastra) శంభాజీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇవాళ తెల్లవారు జామున ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనపై శంభాజీ నగర్ (Maharastra) పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా మాట్లాడుతూ.. “ఉదయం 4 గంటల సమయంలో, ఛత్రపతి శంభాజీ నగర్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటలు రెండవ అంతస్తుకు వ్యాపించలేదు.. కానీ తరువాత ప్రాథమిక విచారణలో ఊపిరాడక ఏడుగురు చనిపోయారని తేలింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.ఈ ఘటనలో విచారణ జరుగుతోంది” అని చెప్పారు.

మహారాష్ట్రలోని (Maharastra) శంభాజీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇవాళ తెల్లవారు జామున ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also read: