Patna : 76 పాఠశాలలు మూసివేత

బీహార్ రాజధాని పాట్నా(Patna) వద్ద గంగానది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 76 స్కూళ్లకు ఈనెల 26 వరకు సెలవులు ప్రకటించారు. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోందని అందుకే కొన్ని ఏరియాల్లో పాఠశాలను మూసివేస్తున్నట్టు పాట్నా (Patna) కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు వెల్లడించారు. నిన్న ఉదయం సమయానికి పలు ప్రాంతాల్లో గంగానది ప్రవాహం ప్రమాదస్థాయిని మించిపోయింది.

76 schools closed in Patna district for three days as Ganga river flows  above danger mark - India News | The Financial Express

గాంధీ ఘాట్ వద్ద (48.6 మీ), హతిదా (41.7 మీ), దిఘా (50.45 మీ) గా ప్రవాహం నమోదైంది. అడినల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యయ అమృత్ ఎస్డీఆర్ఎఫ్, ముంపు బారిన పడనున్న పాట్నా (Patna), బక్సార్, సారన్, వైశాలీ, భోజ్ పూర్, సమస్తీపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, ఖగారియా, భగల్ పూర్, ఖతిహార్, ముంగర్ జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. నది ప్రవాహంపై ఎప్పడికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 376 పంచాయతీల్లోని 13.76 లక్షల మంది ప్రజలపై ఫ్లడ్ ఎఫెక్ట్ పడనుంది.

 

Also read :

Jagganguda: బర్త్​డే పార్టీకి పిలిచి బంగారం చోరీ

NTR : దేవర సునామీ