రన్నింగ్ బస్సు ఎక్కిన ఓ వృద్ధుడికి గుండెపోటు రావడంతో మహిళా కండక్టర్ (RTC Conductor) సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఐడీపీఎల్ సిగ్నల్ వద్దకు రాగాగే మురళీకృష్ణ(67) అనే వృద్ధుడు రన్నింగ్ బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు. వెంటనే అతనికి గుండెపోటు రావడంతో బస్సులోని కండక్టర్ (RTC Conductor) అంజలి స్పందించి బస్సును ఆపించారు. వెంటనే వృద్ధునికి సీపీఆర్ చేశారు. ఆమెకు మరో ప్రయాణికుడు సాయం చేయడంతో మురళీకృష్ణ కాసేపటికి స్పృహలోకి వచ్చాడు. అనంతరం 108 లో ఆస్పత్రికి తరలించారు. మహిళా కండక్టర్ (RTC Conductor), తోటి ప్రయాణికుడు చేసిన కృషిని ప్రయాణికులు మెచ్చుకున్నారు.
Also read :
RTC : ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే రౌడీ షీట్ తెరుస్తం
KTR : అమృత్ టెండర్లలో రూ.8,800 కోట్ల అవినీతి

