రంగారెడ్డి (RangaReddy) కలెక్టరేట్లో ఘటన
ఏఆర్కానిస్టేబుల్తన గన్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్న ఘటన రంగారెడ్డి(RangaReddy) జిల్లా కలెక్టరేట్లో సంచలనంగా మారింది. తెల్లవారు జామున 3 గంటల టైంలో బూత్రూమ్లోకి వెళ్లి ఏఆర్ కానిస్టేబుల్‌గా కలెక్టరేట్ ఆఫీస్ గ్రౌండ్ఫోర్లో డ్యూటీ చేస్తున్న బాలకృష్ణ (27) తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌నోట్‌రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

సూసైడ్ చేసుకున్న టైంలో మృతుడితో పాటు ముగ్గరు కానిస్టేబుల్స్డ్యూటీ చేస్తున్నట్లుగా సమాచారం. మృతుడి స్వగ్రామం రంగారెడ్డి(RangaReddy) జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం కాగా, 2018 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.
Also read :
Ranganath: ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం
Johnny Master: నా భర్తను ట్రాప్ చేసింది

