A Constitutional Dilemma: రాష్ట్రపతికి గడువు విధిస్తే రాజ్యాంగపరమైన గందరగోళం

A Constitutional Dilemma

అసెంబ్లీలు ఆమోదించిన  (A Constitutional Dilemma) బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని కోర్టులు ఆదేశించగలవా? అనే అంశంపై సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలు కోరిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన లిఖితపూర్వక వివరణలో, రాష్ట్రపతికి గడువు విధిస్తే (A Constitutional Dilemma) రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

Image

కేంద్రం అభిప్రాయంలో, రాష్ట్రపతి, గవర్నర్ల వంటి అత్యున్నత పదవులకు గడువు విధించడం సరైంది కాదని తెలిపింది. అలాంటి చర్య వారి రాజ్యాంగపరమైన స్థానాన్ని తగ్గించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి, గవర్నర్ల స్థానాలు అత్యున్నతమైనవని, వారి విధుల్లో లోపాలుంటే వాటిని న్యాయ జోక్యం ద్వారా కాకుండా రాజ్యాంగపరమైన యంత్రాంగాల ద్వారానే సరిదిద్దాలి అని కేంద్రం స్పష్టం చేసింది.

Image

ఈ వివాదానికి నేపథ్యం తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులు. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి వాటిని ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని సుప్రీంకోర్టు గత ఏప్రిల్‌లో తేల్చి చెప్పింది. అంతేకాకుండా, గవర్నర్ లేదా రాష్ట్రపతి రాష్ట్రాలు పంపే బిల్లులపై గరిష్ఠంగా మూడు నెలల్లో ఆమోదం ఇవ్వాలి లేదా తిరస్కరించి పంపించాలి అని కోర్టు ఆదేశించింది.

తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టంచేసింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు తీర్పులో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంపూర్ణ అధికారం ఉందని జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ ఆర్‌. మహాదేవన్‌ల ధర్మాసనం గుర్తుచేసింది.

Image

ఈ పరిణామాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. రాజ్యాంగంలో గడువు విధింపు నిబంధన లేనిప్పుడు సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఎలా ఇచ్చిందని ఆమె ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. అందులో భాగంగా కేంద్రం, రాష్ట్రపతి లేదా గవర్నర్‌లకు గడువు విధించడం రాజ్యాంగ సమతుల్యతకు భంగం కలిగిస్తుందని తన వివరణలో తెలిపింది.

Also read: