డ్రగ్స్(Drugs) పై ఉక్కుపాదం మోపుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా నెక్లెస్ రోడ్ లో విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో సీ ఎస్ శాంత కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోకి డ్రగ్స్‌ను తీసుకువచ్చేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో యాంటీ డ్రగ్స్(Drugs) కమిటీలు వేయాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో కి ఎంత బడ్జెట్ అయినా ఇస్తామని, కానీ రాష్ట్రంలో డ్రగ్స్ ను కనబడకుండా చేయాలని కోరామన్నారు. ప్రతీ పౌరుడు డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాని సూచించారు. ప్రజల సహకారం ఉంటే పోలీసులు రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని, కుటుంబాలను డ్రగ్స్ నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు సమాజంలోకి డ్రగ్స్ ను తీసుకొచ్చి, దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్సిస్తున్నాయని చెప్పారు. మన దేశ శక్తి మన మానవ వనరులేనని, అలాంటి మానవ వనరులను దెబ్బతీయాలని డ్రగ్స్ తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ సరఫరాతో డబ్బులు సంపాదించాలనే ఆలోచన మంచిది కాదన్నారు. విద్యార్థులు తాత్కాలిక సంతోషాల జోలికి వెళ్లి బలికావద్దని ఆయన సూచించారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ర్యాలీకి వివిధ కాలేజీల నుంచి స్టూడెంట్స్ భారీగా హాజరయ్యారు.
డ్రగ్ ఫ్రీ తెలంగాణగా
శాంతి కుమారి, సీఎస్
అందరం కలిసికట్టుగా కృషి చేస్తే త్వరలోనే డ్రగ్ ఫ్రీ తెలంగాణను చూడవచ్చని సీఎస్ శాంతి కుమారి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. డ్రగ్స్ బాధితులకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వారిని విముక్తులను చేయవచ్చన్నారు.
డ్రగ్స్ అమ్మేతే కఠిన చర్యలు
రవి గుప్త, డీజీపీ
డ్రగ్స్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ రవి గుప్తా చెప్పారు. డ్రగ్స్ కట్టడి కోసం పోలీస్ శాఖను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం కావాల్సినన్ని నిధులిస్తుందన్నారు. అందరూ కలిస్తేనే డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి పంపించవచ్చన్నారు.
ALSO READ :

