దివంగత మాజీ ప్రధాని (Manmohan Singh) మన్మోహన్ సింగ్(92) పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. మన్మోహన్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని పేర్కొన్నారు. ఆర్థిక విషయాలపై ఆయనకు చాలా జ్ఞానం ఉందని అన్నారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ.. మన్మోహన్ సభ్యతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని, తనకు మన్మోహన్ చిరకాల మిత్రుడని అన్నారు.

రేపు అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం రేపు (శనివారం) ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకు వెళ్లనున్నారు. రేపు రాజ్‌ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
![]()
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. మన్మోహన్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని పేర్కొన్నారు.

ఆర్థిక విషయాలపై ఆయనకు చాలా జ్ఞానం ఉందని అన్నారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ.. మన్మోహన్ సభ్యతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని, తనకు మన్మోహన్ చిరకాల మిత్రుడని అన్నారు. రేపు అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

ప్రజల సందర్శనార్థం రేపు (శనివారం) ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకు వెళ్లనున్నారు. రేపు రాజ్‌ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Also read:

