స్థానిక సంస్థల్లో బీసీ(Bc) రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా కమిషన్(Bc) ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బీసీ కమిషన్ కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపింది. ఇటీవల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై అధ్యయనం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ కు అప్పగించింది. దీనీపై బీసీ సంక్షేమసంఘం నేత ఆర్ కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణయ్య పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు బీసీ కమిషన్ కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపింది. రెండు వారాల్లోగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వివరాలు అందించాలని సూచిస్తూ కేసును వాయిదా వేసింది.
Also Read :

