Priyanka Gandhi : దేశంలో ఏఏ ట్యాక్స్

ఈ దేశంలో ఏఏ టాక్స్ నడుస్తోందని, అదే అదాని, అంబానీ ట్యాక్స్(Taxes) అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)అన్నారు.ఇవాళ వికారాబాద్ లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ సంపద అంతా అదానీ, అంబానీ చేతుల్లోనే ఉందని, మోదీ పదేండ్లుగా వాళ్ల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇలా సహజ వనరులన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. సంపన్నులకు సంబంధించిన 16 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశారని విమర్శించారు. ఈదేశంలో కర్షకులు యాభై వేల రూపాయలు అప్పులు చేసి కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా మోదీ సర్కారు పట్టించుకోలేదని అన్నారు. ఈ సంపన్నుల చేతిలోనే మీడియా సంస్థలు కూడా ఉన్నాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఆరుగ్యారెంటీల అమలును మొదలు పెట్టిందని అన్నారు. ఇక్కడ సిలిండర్ రూ. 500 కే లభిస్తుందని, నిన్న ఉత్తర ప్రదేశ్ వెళితే అక్కడ రూ. 1200కు ఇస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ భావిస్తోందని, ఆ ప్రయత్నాలకు తెలంగాణ నుంచి గండి కొట్టాలని సూచించారు. బడుగు వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో మోదీ, షా ఓట్లడుగుతారని, పదేండ్లలో ఏం చేశారో చెప్పాలని అడగాలని ప్రియాంక (Priyanka Gandhi)అన్నారు.
మనది సోదరీ సోదరుల బంధం
‘ఈ నేలతో మాకు విడదీయరాని బంధం ఉంది. తెలంగాణ ఇచ్చిన మా అమ్మను మీరు సోనియమ్మ అని పిలిచి తల్లి స్థానం ఇచ్చారు. ఈ లెక్కన మనది సోదర సోదరీమణుల బంధం.’అని ప్రియాంక

 

Also read :

Elections : ముగిసిన ప్రచారం

bandi Sanjay: కేసీఆర్​ను మించి కేటీఆర్​ దాదాగిరి చేసిండు