Aadhar Card : జూన్ 14 దాకా ఆధార్ ఫ్రీ అప్డేట్

aadhar news

జూన్ 14 దాకా ఆధార్ (Aadhar Card )ఫ్రీ అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. మార్చి 14 వరకు ఉన్న గడువును జూన్ 14వ తారీఖు వరకు పెంచినట్టు యూఐడీఏఐ తెలిపింది.
మై ఆధార్ (Aadhar Card ) పోర్టల్ లో లాగిన్ అయ్యి.. చేసుకోవచ్చని చెప్పింది.

3 నెలల గడువు పెంపు

ఆధార్ (Aadhar Card )అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్ కార్డు (Aadhar Card )ఉన్నవారు 2024 జూన్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. మై ఆధార్ (Aadhar Card ) పోర్టల్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రజలంతా తమ ఆధార్ కార్డు (Aadhar Card )ల్లో ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఆధార్ (Aadhar Card )కేంద్రాల్లో రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి వద్ద అయితే ఉచితంగానే చేసుకోవచ్చు. ఇంతకుముందు 2024 మార్చి 14 వరకు ఆధార్ కార్డ్ (Aadhar Card )ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువుగా నిర్ణయించింది. తాజాగా ఆ గడువును పెంచింది.

Also Read:

T-Safe :టీ-సేఫ్‌ యాప్‌ స్టార్ట్

Eesha Rebba :ఈషా రెబ్బా మెరుపులు